Breaking News
Home / National / భవనం కూలి ఆరేళ్ల బాలిక మృతి

భవనం కూలి ఆరేళ్ల బాలిక మృతి

విరార్ (మహారాష్ట్ర): నాలుగు అంతస్తుల భవనం కూలి ఆరేళ్ల బాలిక మరణించిన ఘటన మహారాష్ట్రలోని విరార్ నగరంలో మంగళవారం రాత్రి జరిగింది. పాల్ఘార్ జిల్లా విరార్ నగరంలో నిత్యానంద థామ్ పేరిట అక్రమంగా నాలుగు అంతస్థుల భవనాన్ని నిర్మించారు. ఈ భవనం కూలి ఆరేళ్ల బాలిక మరణించింది. స్థానిక ప్రజలు, మున్సిపల్ అధికారులు, పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. భవనంలోని వారిని ఖాళీ చేయించారు. భవన శిథిలాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *