న్యూఢిల్లీ: బంగారం ధర గత రెండు రోజుల్లో ఏకంగా రూ.900 తగ్గింది. ఎంసీఎక్స్ మార్కెట్లో మంగళవారం గోల్డ్ ఫ్యూచర్స్ ధర పది గ్రాములకు 0.3 శాతం క్షీణించి రూ.36,811కు తగ్గింది. ఇక, గత సెషన్లో బంగారం ధర ఏకంగా రూ.800 తగ్గింది. ఎంసీఎక్స్ మార్కెట్లో వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ.44,056కు క్షీణించింది. గత నెలతో పోలిస్తే బంగారం ధర రూ.3 వేలు తగ్గగా, వెండి రూ.7,400 పతనమైంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.58 తగ్గి రూ.38,140గా రికార్డు కాగా, వెండి ధర మాత్రం ఈసారి కిలోకు రూ.2,360 పెరిగి రూ.47,580కు చేరుకుంది.