Breaking News
Home / States / స్వల్పంగా తగ్గిన ఉల్లి ధరలు…

స్వల్పంగా తగ్గిన ఉల్లి ధరలు…

హైదరాబాద్‌: గత కొన్నిరోజులుగా చికెన్‌ధరనే దాటి పోయిన ఉల్లిగడ్డ ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి కొత్త పంట రావడం ప్రారంభమైంది. బుధవారం హోల్‌సేల్‌ మార్కెట్‌లో క్వింటాల్‌ ఉల్లిధర 13వేల నుంచి 14వేల రూపాయలు పలికాయి. అంతకు వారం రోజుల క్రితం ధరలు క్వింటాల్‌కు 16వేల నుంచి 18వేల రూపాయల వరకు పలికాయి. ఒక పక్క ప్రభుత్వం విదేశాల నుంచి పెదయెత్తున ఉల్లిదిగుమతి చేసుకోవడం ఒక కారణం, మహారాష్ట్ర నుంచి కొత్త పంట కొద్దికొద్దిగా దిగుమతి అవుతున్ననేపధ్యంలో ధరలు స్వల్పంగా తగ్గినట్టు హోల్‌సేల్‌ఉల్లివ్యాపారి ధరణికోట సుధాకర్‌ వెల్లడించారు. క్వింటాల్‌ఉల్లిగడ్డ 12వేల నుంచి 14 పలుకుతున్న నేపధ్యంలో రిటైల్‌ మార్కెట్‌లోనూ ఉల్లిగడ్డ 150 నుంచి 180 రూపాయల వరకు పలుకుతోంది. ఇంతకు ముందు కిలో ధర 170 నుంచి 200 రూపాయల వరకు పలికింది. ఇక మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి దిగుమతులు మొలైన నేపద్యంలో ధరలు తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు. మరో రెండు వారాల్లో ఉల్లిధరలు సాధారణ స్థితికి చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *