Breaking News
Home / National / ఒక్క రూపాయికే స్మార్ట్‌ఫోన్..

ఒక్క రూపాయికే స్మార్ట్‌ఫోన్..

న్యూఢిల్లీ: తమ వినియోగదారులకు చైనా కంపెనీ ఆనర్ తీపికబురు అందించింది. ఫ్లాష్ సేల్ పేరుతో 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ గల ఆనర్ 9ఎన్ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 1కే ఆఫర్ చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఆనర్ ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా ఫ్లాష్ సేల్ పేరుతో డిస్కౌంట్ ఆఫర్‌ను చేపడతామని కంపెనీ తెలిపింది. ఆనర్ 7ఎస్, ఆనర్ ఎన్9‌తోపాటు మరికొన్ని ఫోన్లకు ఈ ఆఫర్ వర్తించనుంది. పరిమితంగా ఉన్న ఆనర్ 9ఎన్ స్మార్ట్‌ఫోన్లపై రూ.1కే ఆఫర్ ప్రకటించినట్లు చైనీస్ సంస్థ పేర్కొంది. సెప్టెంబర్ 11న ఉదయం 11.45 నిమిషాలకు ఫ్లాష్ సేల్ ఆఫర్ ప్రారంభం అవుతుందని ఆనర్ కంపెనీ స్పష్టం చేసింది. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఆనర్ ఆన్‌లైన్ స్టోర్లలో రిజిస్టేషన్ చేసుకోవాలని కంపెనీ సూచించింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఆనర్ 9ఎన్ స్మార్ట్‌ఫోన్‌ రూ. 11,999గా ఉంది. ఆనర్ 9ఎన్ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్ ఇలా ఉన్నాయి. 16ఎంపీ ఫ్రంట్ కెమెరా, పూర్తి స్థాయిలో డిస్‌ప్లే, ప్రీమియమ్ గ్లాస్ డిజైన్, 5.84 అంగుళాల ఎల్‌సీడీ ఎఫ్‌హెచ్‌డీ స్ర్కీన్, స్పష్టత 2280 x 1080, రేషియో 19:9, 2.5డీ గ్లాస్ డిజైన్, బ్యాక్ మిర్రర్, 12 లేయర్స్ మిర్రర్ డిజైన్స్‌తోపాటు మరికొన్ని ఆప్షన్‌లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

Check Also

కన్నీరుపెట్టిస్తున్న ఓ అమర జవాను కథ…..

Share this on WhatsAppపుణె: వ్యాధితో బాధపడుతోందని తెలిసీ ప్రేమ వివాహం చేసుకుని ఓ యువతికి జీవితాన్ని ప్రసాదించాడు. ఎల్లప్పుడూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *