Breaking News
Home / National / డీఎంకే అధ్యక్షుడిపై ఎస్‌ఎంకే నేత జోస్యం….

డీఎంకే అధ్యక్షుడిపై ఎస్‌ఎంకే నేత జోస్యం….

పెరంబూర్‌: ఆదివారం సమత్తువ మక్కల్‌ కట్చి (ఎస్‌ఎంకే) నేత శరత్‌కుమార్‌ విడుదల చేసిన ప్రకటన మేరకు జయలలిత ఎప్పుడూ ప్రజలపక్షంగా ఆలోచిస్తూ పథకాన్ని అమలుచేశారని, అలాంటి పథకాలను అసెంబ్లీలో 110వ నిబంధన కింద ఆమె ప్రకటించేవారని గుర్తుచేశారు. ఆమె మరణానంతరం రెండు నెలల్లో అన్నాడీఎంకే అధికారం కోల్పోతుందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ మాట్లాడుతున్నారని, అధికారం చేపట్టాలంటే ప్రజల కోసం అహర్నిశలు శ్రమించాల్సి ఉందన్నారు. అధికారం చేపట్టిన వెంటనే ప్రస్తుత మంత్రులపై చర్యలు చేపడతానని ఆయన మాట్లాడడం కేవలం ప్రతీకారం తీర్చుకొనే విధంగా ఉందని పేర్కొన్నారు. అలాంటి ఆలోచనలున్న స్టాలిన్‌ ఎన్నటికి ముఖ్యమంత్రి కాలేరని, ప్రస్తుత ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో వుంటుందని ఆయన జోస్యం చెప్పారు. నాంగునేరి, విక్రవాండి ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *