Breaking News
Home / States / Andhra Pradesh / ఆర్టీసీ బస్సులో పాము కలకలం….

ఆర్టీసీ బస్సులో పాము కలకలం….

కడప కోటిరెడ్డిసర్కిల్‌: మంగళవారం ఉదయం ప్రొద్దుటూరు నుంచి కడపకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బయలు దేరింది. అప్పటికే ఆ బస్సు ఇంజిన్‌ భాగంలో ఓ పాము దాగి ఉంది. డ్రైవరుతో సహా ఎవరూ ఈ విషయం గమనించలేదు. ఇంజిన్‌ వేడికి తాళలేక వినాయక నగర్‌ సర్కిల్‌లోకి రాగానే అది కాస్తా పైకి వచ్చేసింది. వెంటనే డ్రైవరు గమనించి బస్సును ఆపేశాడు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు. డ్రైవరు చాకచక్యంగా ప్రయాణికులందరినీ దింపేశాడు. అక్కడికి సమీపంలో పాములు పట్టే వ్యక్తి ఉన్నారని అందులో ఒకరు చెప్పారు. వెంటనే అతనికి ఫోన్‌లో విషయం చెప్పగా ఆ వ్యక్తి బస్సు వద్దకు చేరుకుని పామును పట్టుకోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పామును దూరంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. తర్వాత బస్సు కదిలింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *