Breaking News
Home / Politics / డీకే అరుణకు సోషల్ మీడియా షాక్‌.. .

డీకే అరుణకు సోషల్ మీడియా షాక్‌.. .

వైరల్ న్యూస్:సీనియర్ రాజకీయ నాయకురాలు, బీజేపీ నేత డీకే అరుణకు సోషల్ మీడియా వేదికగా ఊహించని షాక్ ఎదురైంది. గత కొద్దికాలంగా వినిపిస్తున్న ప్రచారాన్ని నిజం చేస్తూ తెరమీదకు వచ్చిన వార్తలతో డీకే అరుణ ఇరుకున పడ్డారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి డా.కె.లక్ష్మణ్‌ను మార్చనున్నారని, డిసెంబర్ నెలాఖరులోగా కొత్త అధ్యక్షున్ని నియమిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ తరుణంలో…మాజీ మంత్రి డీకే అరుణ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని…ఢిల్లీ వెళ్లారని సోషల్ మీడియాలో వార్త వైరల్ అయింది.అయితే, ఈ తరుణంలో….కొత్త అధ్యక్షుడిగా పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, రాజాసింగ్, ఎన్.రామచంద్రరావుతో పాటుగా ఇటీవల పార్టీలో చేరిన డి.కె. అరుణ, జితేందర్ రెడ్డి తదితరులు కూడా పేర్లు తెరమీదకు వచ్చాయి. తాజాగా, డీకే అరుణ ఢిల్లీ నుంచి పిలుపు అందిందని ప్రచారం జరిగింది. వార్త నిజం కాదని, ఇలాంటి అబద్దపు వార్తలను సృష్టించడం , ప్రచారం చేయడం సరైనది కాదని డీకే అరుణ పేర్కొంది. ఇదిలాఉండగా, పరిణామాల నేపథ్యంలో మరో నెల రోజుల వ్యవధిలో లక్ష్మణ్ స్థానంలో కొత్త అధ్యక్షుని ఎంపిక జరుగుతుందని చెప్పుకుంటున్నారు.

Check Also

వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిద్దా

Share this on WhatsAppప్రకాశం జిల్లాలో తెలుగు దేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ మాజీ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *