Breaking News
Home / States / సోలార్ సైకిల్ ఆవిష్కరణ…

సోలార్ సైకిల్ ఆవిష్కరణ…

కొత్తగూడెం : ప్రాజెక్టుల తయారీలో భాగంగా కొత్తగూడెం పాలిటెక్నిక్ విద్యార్థులు సోలార్ సైకిల్ తయారు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ నాగముని నాయక్ సోలార్ సైకిల్‌ను ఆవిష్కరించారు. తానే స్వయంగా సైకిల్‌ను నడిపి విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు ఒక పాత సైకిల్, డీసీ మోటార్, మోటార్ కంట్రోలర్, సోలార్ ప్యానెల్, బ్యాటరీలు, కొన్న ఇనుప రాడ్లు వాడి సోలార్ సైకిల్ తయారు చేశారన్నారు. సోలార్ ప్యానెల్‌పై సూర్యకిరణాలు పడతాయని, ప్యానల్ సైకిల్‌కు కనెక్ట్ అయి ముందుకు వెళ్తుందన్నారు. చార్జింగ్ ఉన్నంత వరకూ ప్రయాణం సాగించవచ్చన్నారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *