Breaking News
Home / States / Andhra Pradesh / తల్లిదండ్రులను హతమార్చిన కొడుకు….

తల్లిదండ్రులను హతమార్చిన కొడుకు….

తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం కడియంలో దారుణం చోటు చేసుకుంది. మతి స్థిమితం లేని వ్యక్తి తల్లిదండ్రులను రాడ్డుతో కొట్టిచంపి పరారయ్యాడు. మానసిక స్థితి సరిగా లేదని కొంతకాలం క్రితం జాలపర్తి రమేశ్‌(28)ను అతడి భార్య వదిలేసి వెళ్లిపోయింది. తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్న రమేశ్‌.. తల్లిదండ్రులు నాగేశ్వరరావు, మార్తమ్మపై ఇనుపరాడ్డుతో కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కేకలు విని ఇరుగుపొరుగువారు అక్కడికి రావడంతో రమేశ్‌ పరారయ్యాడు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *