Breaking News
Home / Crime / కన్నతండ్రిని హతమార్చిన కొడుకు…

కన్నతండ్రిని హతమార్చిన కొడుకు…

నల్గొండ: కన్నకొడుకే తండ్రిని హతమార్చిన ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్‌లో చోటుచేసుకుంది. మల్ల గోవర్దన్‌ (60) తన కుమారుడు సతీష్‌తో కలిసి ప్రకాశం బజార్‌లో నివాసం ఉంటున్నారు. సతీష్‌ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అప్పటికే టీవీ చూస్తున్న తండ్రి గోవర్దన్‌తో టీవీ ఛానల్‌ మార్చే విషయంలో గొడవపడ్డారు. దీంతో ఆవేశానికి గురైన సతీష్‌ పక్కనే ఉన్నరోకలి బండతో తండ్రి తలపై కొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో గోవర్దన్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *