జైపూర్: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ శుక్రవారంనాడు ఎన్నికయ్యారు. తనను ఆర్సీఏ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు వైభవ్ కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్న యువతను ప్రోత్సహించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. రాజస్థాన్ క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తానని, క్రికెట్ రంగంలో యువ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. రాజస్థాన్ క్రికెట్ ప్రియులను ప్రోత్సహించడంలో తానెప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు.
