Breaking News
Home / Film News / టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన పాట….

టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన పాట….

హైదరాబాద్‌: ‘స్టైలిష్‌ స్టార్‌’ అల్లు అర్జున్‌ ‘సామజవరగమనా..’ పాట యూట్యూబ్‌లో అస్సలు ఆగడం లేదు. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించి, దూసుకుపోతోంది. ‘అల వైకుంఠపురములో..’ సినిమాలోని ఈ పాటను యూట్యూబ్‌లో అత్యధిక మంది లైక్‌ చేసిన తొలి తెలుగు పాటగా నిలిచింది. 7 లక్షల మంది ఈ వీడియోను లైక్‌ చేశారు. 4 కోట్ల మందికిపైగా వీడియోను వీక్షించడం విశేషం. తమన్‌ సంగీతం, సిధ్‌ శ్రీరామ్‌ స్వరం ఈ గీతానికి ప్రధాన బలమయ్యాయి. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ శ్రోతలకు ధన్యవాదాలు చెప్పారు. ‘అత్యధిక మంది లైక్‌ చేసిన తెలుగు పాట. మీ ప్రేమకు థాంక్స్‌’ అని ట్వీట్‌ చేశారు.

‘అల వైకుంఠపురములో..’ చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే, నివేదా పేతురాజ్‌ కథానాయికలు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత సీనియర్‌ నటి టబు ఈ చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులోని ప్రత్యేక గీతంలో కథానాయిక కాజల్‌ ఆడిపాడనున్నారట. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా విడుదల కాబోతోంది.

Check Also

సినిమా షూటింగ్‌లు, థియేటర్స్ ఓపెనింగ్..!

Share this on WhatsAppకరోనా ఎఫెక్ట్‌, లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి… థియేటర్లు మూతపడ్డాయి… రిలీజ్‌ కావాల్సిన సినిమాలు వాయిదా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *