Breaking News
Home / National / కన్నడ ట్రబుల్ షూటర్ ను కలిసిన సోనియా…..

కన్నడ ట్రబుల్ షూటర్ ను కలిసిన సోనియా…..

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్‌ కేసులో కర్ణాటక కాంగ్రెస్‌ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. ఆయనను కలవాడనికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ ఉదయం తీహార్ జైలుకు వెళ్లారు. ఈ సందర్భంగా శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ కూడా ఆమెతో పాటు ఉన్నారు. భేటీ అనంతరం మీడియాతో డీకే సురేశ్ మాట్లాడుతూ, శివకుమార్ వెంట పార్టీ మొత్తం ఉంటుందని సోనియా తెలిపారని చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసును పెట్టారని, ఇతర కాంగ్రెస్ నేతలను కూడా టార్గెట్ చేశారని, బీజేపీతో మనం పోరాటం చేసి, బయటపడాలని సోనియా చెప్పినట్లు తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *