Breaking News
Home / National / ‘మహా’ ప్రచారానికి సోనియా టీమ్

‘మహా’ ప్రచారానికి సోనియా టీమ్

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ‘స్టార్ క్యాంపెయినర్ల’ జాబితాను శుక్రవారంనాడు ప్రకటించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. పార్టీ ఎన్నికల కమిటీకి గురువారంనాడు రాజీనామా చేసిన అశోక్ తన్వర్ పేరు కూడా ఇందులో చోటుచేసుకోవడం విశేషం.

కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారకర్తల జాబితాలో పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, కుమారి షెల్జా, భూపేష్ బఘెల్, ఆనంద్ శర్మ, జ్యోతిరాదిత్య సింధియా, కెప్టెన్ అజయ్ యాదవ్, కిరిన్ చౌదరి, రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, కుల్దీప్ బిష్ణోయ్, దీపేందర్ హుడా తదితరులు ఉన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *