న్యూఢిల్లి : కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేటి హర్యానా పర్యటన రద్దయింది. హర్యానాలోని మహేంద్రగఢ్‌లో జరిగే ఎన్నికల ప్రచార ర్యాలీలో సోనియా గాంధీ పాల్గొనవలసి ఉంది. అయితే సోనియా ఈ ర్యాలీలో పాల్గొనడం లేదు. సోనియా బదులుగా ఆమె కుమారుడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ ర్యాలీలో పాల్గొంటారు.
