Breaking News
Home / National / గవర్నర్ పాలన ఎత్తివేసిన మరుక్షణమే…

గవర్నర్ పాలన ఎత్తివేసిన మరుక్షణమే…

న్యూఢిల్లీ: నేడు ‘జనజాగరణ్ సభ’లో బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ మాట్లాడుతూ గృహ నిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్ నేతలకు త్వరలోనే విముక్తి కల్పిస్తామని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో గవర్నర్ పాలన ఎత్తివేసిన మరుక్షణం గృహ నిర్బంధంలో ఉన్న నేతలను విడుదల చేస్తామని, ఆ తర్వాత వారు తమ రాజకీయ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే, ఈ ప్రాంతంలో ఎస్సీ కమిషన్, మహిళా, మైనారిటీ కమిషన్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్టికల్ 370ని కేన్సర్‌తో పోల్చిన రాంమాధవ్ 70 ఏళ్లుగా ఉన్న ఈ జాడ్యాన్ని ప్రధాని నరేంద్రమోదీ కేవలం 70 గంటల్లోనే పారదోలారని ప్రశంసించారు. రాష్ట్రానికి చెందిన 200 మంది నేతలు గృహ నిర్బంధంలో ఉన్న తర్వాత రాష్ట్రం ప్రశాంతంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *