Breaking News
Home / National / గల్వాన్‌ లోయలో కీలక పరిణామం

గల్వాన్‌ లోయలో కీలక పరిణామం

న్యూఢిల్లీ: భారత్, చైనా దేశాలకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గల్వాన్‌ లోయలో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్వాన్‌ లోయ నుంచి చైనా బలగాలు దాదాపు కిలోమీటరు మేర వెనక్కి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే విధంగా అక్కడ చేపట్టిన నిర్మాణాలను కూడా తొలగిస్తున్నట్ల పేర్కొన్నాయి. ఇందుకు ప్రతిగా భారత బలగాలు కూడా వెనక్కి మళ్లాయని.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా ‘బఫర్‌ జోన్‌’ ఏర్పాటు చేసినట్లు వెల్లడించాయి. అయితే బలగాల ఉపసంహరణలో చైనా ఎంతమేరకు నిజాయితీగా వ్యవహరిస్తుందో తెలియాలంటే మరికొంత సమయం వేచిచూడక తప్పదని అభిప్రాయపడ్డాయి.

కాగా తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయ ప్రాంతంలోని భారత భూభాగంలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 వద్ద అక్రమంగా వేసిన గుడారాన్ని తొలగించమని భారత సైనికులు సూచించగా.. చైనా ఆర్మీ జూన్‌ 15న దాడికి తెగబడిన విషయం తెలిసిందే. రాళ్లు, ఇనుప రాడ్లను ఉపయోగించి భారత సైనికులను దొంగదెబ్బ కొట్టారు. ఈ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయి చేరాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్- చైనా మధ్య వివిధ స్థాయిల్లో మూడు దఫాలుగా చర్చలు జరిగాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *