విశాఖపట్నం: వైజాగ్లో భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా 431 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (160: 18 ఫోర్లు, 6 సిక్సర్లు), క్వింటన్ డీ కాక్(111: 16 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో సౌతాఫ్రికా గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించగా, కెప్టెన్ డుప్లెసిస్(55) అర్ధసెంచరీతో రాణించాడు. భారత్ బౌలర్లలో రవి చంద్రన్ అశ్విన్ 7 వికెట్లు సాధించాడు. జడేజా 2 వికెట్లు తీయగా, ఇషాంత్ ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో, భారత్కు 71 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 502-7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసిన విషయం తెలిసిందే. ఓపెనర్లు మయాంక్ డబుల్ సెంచరీతో, రోహిత్ భారీ సెంచరీతో చెలరేగిన విషయం విదితమే.
