Breaking News
Home / National / దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్‌ 275 ఆలౌట్‌….

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్‌ 275 ఆలౌట్‌….

పూణె : మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మూడోరోజు టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌ను 601/5 వద్ద డిక్లేర్‌ చేసిన కోహ్లి సేన ప్రత్యర్థిని 275 పరుగులకు ఆలౌట్‌ చేసింది. 36/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన సఫారీ జట్టును భారత బౌలర్లు కుదురుకోనివ్వలేదు. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (64), డికాక్‌ (31), బ్రూయెన్‌ (30) మినహా మిగతా అందరూ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. అయితే, 162 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిన సఫారీ జట్టును టెయిలెండర్లు కేశవ్‌ మహరాజ్‌, ఫిలాండర్‌ ఆదుకునే ప్రయత్నం చేశారు. కేశవ్‌ మహరాజ్‌ (132 బంతుల్లో 72; 12 ఫోర్లు), ఫిలాండర్‌ (164 బంతుల్లో 44 నాటౌట్‌; 5 ఫోర్లు) పోరాటంతో సఫారీ జట్టు ఈ మాత్రమైనా స్కోరు సాధించగలిగింది. అశ్విన్‌ నాలుగు, ఉమేష్‌ యాదవ్‌ మూడు, మహ్మద్‌ షమీ రెండు, జడేజా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఇంకా రెండు రోజులు ఆట మిగిలి ఉంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *