Breaking News
Home / States / Andhra Pradesh / మరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా….

మరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా….

విశాఖపట్నం: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఆరో వికెట్‌ కోల్పోయింది. సాధికారికంగా ఆడుతున్న ఎల్గర్‌ను (160, 287 బంతులు; 18 ఫోర్లు, 4 సిక్సర్లు) జడేజా బోల్తా కొట్టించాడు. డీప్‌మిడ్‌ వికెట్ మీదుగా భారీ షాట్‌ ఆడి పుజారా చేతికి చిక్కాడు. దీంతో భారత్‌కు ఎట్టకేలకు కాస్త విరామం తర్వాత వికెట్‌ లభించింది. 178 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీ జట్టును డికాక్‌ (96)తో కలిసి ఎల్గర్‌ ఆదుకున్నాడు. ఆరో వికెట్‌కు 164 పరుగులు జోడించాడు. ఎల్గర్‌ను పెవిలియన్‌కు పంపండంతో జడేజా 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఎడమచేతి వాటం బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. జడేజా 44 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఆరు వికెట్లు కోల్పోయి 354 పరుగులు చేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *