Breaking News
Home / States / Andhra Pradesh / తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా…

తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా…

విశాఖపట్టణం: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 502/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రోహిత్ శర్మ (176) అవుటయ్యాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (215) డబుల్ సెంచరీతో ఇరగదీశాడు. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. ఆ తర్వాత త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ 20, రవీంద్ర జడేజా 30, సాహా 21 పరుగులు చేశారు.

భారత్ 502/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సౌతాఫ్రికా 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఓపెనర్ మార్క్‌రమ్ (5) బౌల్డయ్యాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *