Breaking News
Home / National / రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా….

రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా….

పూణె: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో శనివారం ఉదయం భారత్‌ శుభారంభం చేసింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 36/3తో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా.. ఆట ప్రారంభమైన అరగంటలోనే రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత షమి వేసిన 18వ ఓవర్‌లో నోర్జె(3) నాలుగో స్లిప్‌లో కోహ్లీ చేతికి చిక్కగా తర్వాత ఉమేశ్‌ యాదవ్‌ వేసిన 21వ ఓవర్‌లో డిబ్రుయిన్‌(30) ఆడిన బంతిని కీపర్‌ అందుకున్నాడు. దీంతో మూడో రోజు ఉదయం టీమిండియా ఫాస్ట్‌ బౌలర్లు చెరో వికెట్‌ సాధించారు. అలాగే శుక్రవారం ఆఖరి సెషన్‌లోనూ ఉమేశ్‌ రెండు, షమి ఒక వికెట్‌ తీసిన సంగతి తెలిసిందే. 21 ఓవర్లకు దక్షిణాఫ్రికా 53/5తో నిలవగా డుప్లెసిస్‌, డికాక్‌ క్రీజులో ఉన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *