Breaking News
Home / National / రెండు వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా…

రెండు వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా…

పూణె: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆదిలోనే ఓపెనర్లను కోల్పోయింది. ఉమేశ్‌ యాదవ్‌ ధాటికి సఫారీల ఓపెనర్లు మార్క్రమ్‌, ఎల్గర్‌ (6) పెవిలియన్‌ బాట పట్టారు. దీంతో దక్షిణాఫ్రికా 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు జడేజా (91) ఔటవ్వడంతో భారత్‌ 601/5 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. సారథి విరాట్‌ కోహ్లీ(336 బంతుల్లో 33×4, 2×6) ద్విశతకంతో చెలరేగాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 20 పరుగులు చేసింది. ఇంకా టీమ్‌ఇండియా కంటే 581 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో డి బ్రూయిన్‌ (7), బవుమా (7) ఉన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *