Breaking News
Home / Sports / సౌతాఫ్రికా సూపర్‌ స్టార్‌ ‘బిగ్’ ఎంట్రీ…!

సౌతాఫ్రికా సూపర్‌ స్టార్‌ ‘బిగ్’ ఎంట్రీ…!

స్పోర్ట్స్ న్యూస్: సౌతాఫ్రికా సూపర్‌ స్టార్‌ ఏబీ డివిలియర్స్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో అరంగేట్రం చేయబోతున్నాడు. 2019-20 సీజన్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ తరఫున బరిలో దిగనున్నాడు. ఈ నేపథ్యంలో ఆ ఫ్రాంఛైజీతో హార్డ్‌హిట్టర్‌ ఒప్పందం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ప్రీమియర్‌ టీ20 లీగ్‌లో ఏబీడీ ఎంట్రీ ఇవ్వబోతుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. బిగ్‌బాష్‌లో బ్రిస్బేన్‌ హీట్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు సంతకం చేయడం చాలా సంతోషంగా ఉంది. గ్రేట్‌ టీమ్‌..గ్రేట్‌ సిటీ అని డివిలియర్స్‌ ట్వీట్‌ చేశాడు. బ్రిస్బేట్‌ టీమ్‌లో క్రిస్‌లిన్‌, లబుచానె లాంటి హిట్టర్లు ఉన్నారు. అతను 360 డిగ్రీల, అద్భుతమైన నైపుణ్యం గల ఆటగాడు. మంచి స్వభావం, తెలివైన నాయకుడు. వచ్చే సమ్మర్‌లో అతడిని జట్టులో చేర్చుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాం. తన అసాధారణ ఆటతో ఫ్యాన్స్‌ను అలరిస్తాడని ఆశిస్తున్నట్లు బ్రిస్బేన్‌ హీట్‌ హెడ్‌ కోచ్‌ డారెన్‌ లీమన్‌ పేర్కొన్నాడు. డివిలియర్స్‌ తన కెరీర్‌లో 295 టీ20లు ఆడి 149.84 స్ట్రైక్‌రేట్‌తో 8,186 పరుగులు సాధించాడు. గతేడాది ఐపీఎల్‌లో 442 పరుగులు చేశాడు.

Check Also

భారత్‌–ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై లయన్‌ వ్యాఖ్య

Share this on WhatsAppసిడ్నీ: విరాట్‌ కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 టెస్టు సిరీస్‌ను 2–1తో సొంతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *