Breaking News
Home / National / రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

బెంగళూరు: ‘అనర్హత వేటు’ అంశం మరోసారి కర్ణాటక రాజకీయ సంక్షోభం, విశ్వాస పరీక్ష నేపథ్యంలో చర్చకు వచ్చింది. రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్పష్టత ఇవ్వాలని సంకీర్ణ ప్రభుత్వ నేతలు కోరిన నేపథ్యంలో స్పీకర్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. 23వ తేదీ ఉదయం 11 గంటల్లోగా రెబల్ ఎమ్మెల్యేలు తన కార్యాలయానికి వచ్చి కలవాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఒకవేళ రెబల్ ఎమ్మెల్యేలపై ‘అనర్హత వేటు’ అంటూ పడితే వారి పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.

సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తే తదుపరి ప్రభుత్వంలో మంత్రులయ్యే అవకాశం వారికి ఉండదు. ఉప ఎన్నికల్లో పోటీకి సైతం వారిని అనుమతించరు. సహజంగా విశ్వాస పరీక్షకు ముందు విప్ జారీ చేస్తుంటారు. దాన్ని ఎమ్మెల్యేలు పట్టించుకోకపోతే వారు అనర్హతను ఎదుర్కోవలసి వస్తుంది. అనర్హత వేటు పడితే, ప్రస్తుత అసెంబ్లీకి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోతారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే వారు పోటీ చేయాల్సి ఉంటుంది.

Check Also

తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ…

Share this on WhatsAppఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవహక్కుల సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *