కోల్‌కతా: భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య వచ్చే నెల నుంచి టెస్ట్ సిరీస్ మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. ఇందులో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు ఈ స్టేడియంలో తలపడటం ఇదే తొలిసారి. దీనికి గుర్తుగా నవంబరు 22 నుంచి 26 వరకు జరగనున్న టెస్టు సిరీస్ మ్యాచ్‌ను వీక్షించాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) ఆహ్వానం అందింది.
మ్యాచ్‌లకు ఇలా దేశ ప్రధానులను ఆహ్వానించడం ఇదే తొలిసారి కాదు. 2011 ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌కు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించగా ఆయన ఆ మ్యాచ్‌ను తిలకించారు. భారత్-పాక్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌కు నాటి పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ కూడా హాజరయ్యారు. ఇక భారత్‌లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, రెండు టెస్టుల సిరీస్ కోసం నవంబరు 3న బంగ్లా జట్టు రానుంది.