Breaking News
Home / National / శాసనసభలకు ప్రత్యేక అధికారాలు…

శాసనసభలకు ప్రత్యేక అధికారాలు…

తిరువనంతపురం : రాష్ట్రాల శాసనసభలకు కూడా ప్రత్యేకాధికారాలు ఉంటాయని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ అన్నారు. కేరళ అసెంబ్లిలో సిఎఎకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించడంపై బీజేపీ నేతలు కేరళ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. ఈ విమర్శలకు విజయన్‌ స్పందించారు. సీఎఎ అంశం పార్లమెంటు పరిధిలోనిదని, దానికి వ్యతిరేకంగా శాసన సభలో తీర్మానం ఎలా చేస్తారంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్‌ నరసింహారావు ప్రశ్నించారు. పార్లమెంటు అధికారాలను ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ జివిఎల్‌ రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. కాగా శాసనసభలకు కూడా వాటి ప్రత్యేక అధికారాలు, రక్షణ ఉంటాయని, వాటిని ఉల్లంఘించరాదని అన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *