Breaking News
Home / States / Andhra Pradesh / రేపు సికింద్రాబాద్‌ -తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

రేపు సికింద్రాబాద్‌ -తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

తిరుపతి : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాదులో ఈ ప్రత్యేక రైలు (07429) శుక్రవారం రాత్రి 7.45 గంటలకు బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతూ మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతిలో (07430) ఆదివారం సాయంత్రం 5 గంటలకు బయలు దేరి వచ్చిన మార్గంలోనే ప్రయాణించి మరుసటి రోజు ఉదయం 5.55 గంటలకు సికింద్రాబాదు చేరుకుంటుంది. ముందస్తు రిజర్వేషన్‌ టికెట్టు సదుపాయం కల్పించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *