Breaking News
Home / States / Andhra Pradesh / విశాఖ-అలహాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్ల ఏర్పాటు

విశాఖ-అలహాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్ల ఏర్పాటు

విశాఖపట్నం: పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తూర్పు కోస్తా రైల్వే సువిధ స్పెషల్‌ రైళ్లను విశాఖపట్నం-అలహాబాద్‌-సుబేదార్‌గంజ్‌ మధ్య నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. నంబరు 82507 ప్రత్యేక రైలు అక్టోబరు 8 నుంచి నవంబరు 19 వరకు విశాఖలో ప్రతి మంగళవారం రాత్రి 11.50 గంటలకు బయలుదేరుతుంది. గురువారం ఉదయం 8.10 గంటలకు అలహాబాద్‌ చేరుకుని అక్కడి నుంచి సుబేదార్‌గంజ్‌కు ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నంబరు 82508 రైలు అక్టోబరు 10 నుంచి నడుస్తుంది. సుబేదార్‌గంజ్‌ నుంచి ప్రతి గురువారం ఉదయం 10.10కి బయలుదేరి శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. నవంబరు 21వరకు ఈ రైలు నడుస్తుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *