Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు…

దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు…

గుంతకల్లు/అనంతపురం : దసరా ఉత్సవాల సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంతకల్లు మీదుగా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చెన్నై సెంట్రల్‌-అహ్మదాబాద్‌ (నెం. 06051) ప్రత్యేక రైలును అక్టోబరు 5, 12, 19, 26, నవంబరు 2, 9 తేదీలలో నడపనున్నట్లు తెలిపారు. ఈ రైలు శనివారాలలో రాత్రి 8-10 గంటలకు చెన్నైలో బయలుదేరి అహ్మదాబాద్‌కు సోమవారం తెల్లవారుజాము 4-10 గంటలకు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు (నెం. 06052) అహ్మదాబాద్‌లో అక్టోబరు 7, 14, 21, 28, నవంబరు సోమవారాలలో ఉదయం 9-10 గంటలకు బయలుదేరి చెన్నైకు మంగళవారం సాయంత్రం 5-10 గంటలకు చేరుకుంటుందన్నారు. ఈ రైలు అరక్కోణం, రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, వాడి, షోలాపూర్‌, పూనే, లోనావాలా, సూరత్‌, వడోదర స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందన్నారు.

ప్రత్యేక రైలు ఫ్రీక్వెన్సీ పెంపు
యల్హంక-కాలబురిగి-యల్హంక మధ్య వేసిన సువిధా ప్రత్యేక రైళ్లు (నెం. 82661/62)ను బీదరు వరకూ పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, రాయచూరు మీదుగా నడుస్తాయని వీటిని అక్టోబరు 4, 7 తేదీల్లో బీదర్‌ వరకూ పొడిగించినట్లు అధికారులు వివరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *