Breaking News
Home / States / Andhra Pradesh / గుంటూరు మీదగా ప్రత్యేక రైళ్లు

గుంటూరు మీదగా ప్రత్యేక రైళ్లు

గుంటూరు: దసరా పండగ రద్దీని దృష్టిలో పెట్టుకొని గుంటూరు మీదగా నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే సీనియర్‌ డీసీఎం డీ నరేంద్రవర్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబరు. 07011 సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు ఈ నెల 5న రాత్రి 7.25 గంటలకు బయలుదేరి రాత్రి 11.07కి పిడుగురాళ్ల, 11.50కి సత్తెనపల్లి, అర్ధరాత్రి 12.55కి గుంటూరు, మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు కాకినాడ టౌన్‌కి చేరుకొంటుంది. ఈ రైలు గుడివాడ, బీమవరం తణుకు, నిడదవోలు మార్గంలో నడుస్తుంది. నెంబరు. 07012 కాకినాడ టౌన్‌ – సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 8న సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరి అర్ధరాతి 12.40కి గుంటూరు, 1.35కి సత్తెనపల్లి, 3.10కి పిడుగురాళ్ల మరుసటి రోజు ఉదయం 8.50కి సికింద్రాబాద్‌ చేరుకొంటుంది.

నెంబరు. 06059 చెన్నై సెంట్రల్‌ – సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 11న రాత్రి 7.30 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 2.35కి గుంటూరు, 3.48కి పిడుగురాళ్ల, మరుసటి రోజు ఉదయం 8.25కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. నెంబరు. 06060 సికింద్రాబాద్‌ – చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక రైలు ఈ నెల 13న రాతిర 8.10 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 12.18కి పిడుగురాళ్ల, 1.30కి గుంటూరు, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లలో ఏసీ టూటైర్‌, మూడు ఏసీ త్రీటైర్‌, 12 స్లీపర్‌క్లాస్‌ భోగీలుంటాయని సీనియర్‌ డీసీఎం తెలిపారు.

నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలు వేళ మార్పు
తిరుపతి వైపు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలువేళల్లో కూడా మార్పు చేశారు. అక్టోబరు 5 నుంచి నెంబరు 12733 తిరుపతి – లింగంపల్లి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ గుంటూరుకు అర్ధరాత్రి దాటాక 12.40కి చేరుకొని 12.50కి బయలుదేరుతుంది. ఈ రైలు సత్తెనపల్లికి 1.25కి, పిడుగురాళ్లకి 1.49కి, నడికుడికి 2.10కి, సికింద్రాబాద్‌కు ఉదయం 6 గంటలకే చేరుకుంటుంది. ఆ తర్వాత బేగంపేటకు 6.17కి, లింగంపల్లికి 6.55కి చేరుకుంటుంది. దాదాపుగా 25 నిమిషాల పాటు ఈ రైలు వేగాన్ని పెంచారు. అలానే ఈ రైలు ఇక నుంచి ఎల్‌హెచ్‌బీ బోగీలతో రాకపోకలు సాగిస్తుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *