Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / వైసీపీ నేత ట్వీట్లపై స్పందించిన శ్రీ భరత్….

వైసీపీ నేత ట్వీట్లపై స్పందించిన శ్రీ భరత్….

అమరావతి: నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ భరత్ కుటుంబం రూ.13 కోట్లు బకాయి పడ్డట్టు ఆంధ్రా బ్యాంక్, పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లపై శ్రీ భరత్ స్పందించారు.

“విజయసాయి రెడ్డి గారు…ఇప్పుడు మీరు ప్రభుత్వంలో బాధ్యత గల పదవిలో ఉన్నారు. మీరు అంతే బాధ్యతగా మాట్లాడాలని ఆశిస్తాము. కానీ అందుకు భిన్నంగా మీరు చేస్తున్న వ్యాఖ్యలకు నేను బదులు చెప్పాల్సి వస్తోంది. ర్మాష్ట ప్రభుత్వం నుండి మాకు రావలసిన బకాయిలు దాదాపు రూ. ౩ కోట్లు. ట్రాన్స్ కో గనుక మాకు సకాలంలో చెల్లింపులు చేసి ఉంటే బ్యాంకు రుణం సమయానికి చెల్లించే వాళ్ళం అని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా ప్రభుత్వం బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న విషయం మీకు స్పష్టంగా తెలిసి కూడా, నేను ప్రజల డబ్బును దొంగిలించినట్లు నిందలు వేయడం చాలా విచారకరం అంటూ వరుస ట్వీట్లు వేశారు. వీలైతే ఔత్సాహిక పరిశ్రమలను ప్రోత్సహించండి కాని నాలాంటి వారిని అవమానపరిచేలా వ్యవహారించవద్దని విన్నవిస్తున్నాను” అంటూ ఎంపీ విజయసాయిరెడ్డికి లేఖ రాసారు.

Check Also

పెళ్లికి వచ్చినవాళ్ళకు విందు భోజనం పార్సిల్ ..

Share this on WhatsAppకరోనా దెబ్బకు ఎక్కడి అక్కడే ఆగిపోయాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు , పూజలు , అన్ని ఆగిపోయాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *