Breaking News
Home / Crime / శ్రీదేవిని హ‌త్య చేసి చంపేశారు……?

శ్రీదేవిని హ‌త్య చేసి చంపేశారు……?

అందాల తార శ్రీదేవి గ‌తేడాది ఫిబ్ర‌వ‌రి 24న దుబాయ్‌లో మ‌ర‌ణించారు.ఆమె ప్ర‌మాద‌వ‌శాత్తు బాత్ ట‌బ్‌లో ప‌డి మ‌ర‌ణించింద‌ని రిపోర్టులు ఇచ్చిన‌ప్ప‌టికీ. శ్రీదేవి మ‌ర‌ణంపై ప‌లువురు అనుమానాల‌ను వ్య‌క్తం చేశారు. లేటెస్ట్‌గా కేర‌ళ డీజీపీ రిషిరాజ్ సింగ్ శ్రీదేవి మ‌ర‌ణం ప్ర‌మాదం కాద‌ని, ప‌థ‌కం ప్ర‌కారం హ‌త్య చేశార‌ని అన్నారు. ఈ విష‌యాన్ని కేర‌ళకు చెందిన ప్ర‌ముఖ వార్త ప‌త్రిక ప్ర‌చురించింది.

“శ్రీదేవిని హ‌త్య చేసి చంపేశార‌ని, నా స్నేహితుడు ఫొర్సెనిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ఉమాద‌తాన్ చెప్పారు. ఆమెది హ‌త్య అనే విష‌యాన్ని తెలియ‌జేసేలా ఆధారాలు కూడా చూపిస్తున్నాడు“ అని తెలియ‌జేశారు. మ‌ద్యం ఎక్కువ‌గా సేవించి ఉంటే.. కేవ‌లం ఒక అడుగులోతు నీరు మాత్ర‌మే ఉన్న బాత్ ట‌బ్‌లో చ‌నిపోయే అవ‌కాశం లేద‌ని, ఆమెను ఎవ‌రైనా వెనుక నుండి నీటిలో ముంచి చంపేసి ఉంటారని త‌న అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. ఓ పోలీసు ఉన్న‌తాధికారి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌లనంగా మారింది.

Check Also

సాయి ధరమ్ తేజ్ సినిమాకు చిరంజీవి వింత సెంటిమెంట్ !

Share this on WhatsAppవచ్చేనెల విడుదల కాబోతున్న సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజు పండుగే’ సినిమాకు సంబంధించి ఒక కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *