అమరావతి: విండ్, సోలార్ ఎనర్జీని కొనుగోలు చేయలేదని వస్తోన్న వార్తలు అవాస్తవమని విద్యుత్‌శాఖ కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. వాతావరణ మార్పుల కారణంగా 10 రోజులుగా విండ్, సోలార్ విద్యుత్పత్తి సరిగా లేదని, గతేడాదితో పోలిస్తే ఈసారి బొగ్గు నిల్వ అధికంగానే ఉందని, దానికి తోడు వచ్చే 7 రోజుల పాటు రోజుకు 8 ర్యాక్‌ల చొప్పున సింగరేణి నుంచి బొగ్గు వస్తుందని ఆయన పేర్కొన్నారు. కేఎస్కే థర్మల్ కేంద్రానికి రూ.120 కోట్లు చెల్లించామని, కరెంటులో అనూహ్య ప్రగతిని సాధిస్తామని విద్యుత్‌శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.
