Breaking News
Home / States / నిన్న ఖమ్మంలో నిప్పంటించుకున్న శ్రీనివాస్‌రెడ్డి మృతి

నిన్న ఖమ్మంలో నిప్పంటించుకున్న శ్రీనివాస్‌రెడ్డి మృతి

హైదరాబాద్‌: ఖమ్మం డిపో ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందారు. శనివారం నాడు ఖమ్మంలో నిప్పంటించుకున్న శ్రీనివాస్‌రెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కంచన్‌బాగ్‌ అపోలో ఆస్పత్రి దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆస్పత్రి ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకుని రంగంలోకి పోలీసులు పలువుర్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులు కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.

మరణశయ్య మీద కొట్టుమిట్టాడుతున్నా…!
90% గాయాలైన శ్రీనివాస్‌ చికిత్స కోసం హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించగా.. మరణశయ్య మీద కొట్టుమిట్టాడుతున్నా.. ఆయన నోటి నుంచి అవే మాటలు! ‘కార్మికులు అంతా మంచిగుండాలె.. నాకేమైనా పర్వాలేదు’ అనే!! ఈ విషాదంతో చలించిన శ్రీనివాస్‌ రెడ్డి సన్నిహితుడు, మరో డ్రైవర్‌ వెంకటేశ్వర్లు కూడా పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ‘తెలంగాణ కోసం పాటుపడిన మమ్ములను కేసీఆర్‌ పట్టించుకోవడం లేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసినట్లుగానే.. ఇప్పుడూ జరిగితేనే కానీ ప్రభుత్వం స్పందించేలా లేదు’ అని కన్నీరు పెట్టుకున్నాడు.

గంట పావు దాకా చికిత్సే లేదు!
ఆత్మాహుతి యత్నం చేసిన శ్రీనివాసరెడ్డి చికిత్సకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురయ్యాయి. 90 శాతం గాయాలైన శ్రీనివాస్‌ రెడ్డిని 4.15 గంటలకు ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తే.. 4.35 నిమిషాలకు పేరు నమోదు చేసి క్యాజువాలిటీకి తీసుకెళ్లారు. సాయంత్రం 5.30 గంటల వరకూ ఆయన్ను అత్యవసర వైద్య సేవలు కోసం తరలించలేదు. అక్కడికక్కడే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, ఆర్టీసీ కార్మికులు ఆయన్ను అక్కడి నుంచి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

అక్కడి వైద్యులు పరిశీలించి, పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. 6:50 నిమిషాలకు శ్రీనివాసరెడ్డిని బయటకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. స్థానికంగానే వైద్యం అందించాలని సూచించి, మళ్లీ అదే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెజిస్ట్రేటు వద్ద వాంగ్మూలం ఇప్పించాలంటూ ఆపడంతో ఇంకా సమయం పట్టింది. చివరకు, కార్మిక సంఘాల నాయకులు, కుటుంబ సభ్యుల ఒత్తిడితో హైదరాబాద్‌కు తరలించారు. నిన్నట్నుంచి చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *