Breaking News
Home / States / Andhra Pradesh / నాసా వెబ్‌సైట్‌లో విశేషంగా శ్రీవారి పేరు…

నాసా వెబ్‌సైట్‌లో విశేషంగా శ్రీవారి పేరు…

తిరుపతి: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తలపెట్టిన మార్స్‌ ప్రయోగానికి సంబంధించిన రోవర్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సూచించిన పేర్లను ఓ మైక్రోచిప్ లో నిక్షిప్తం చేసి అంగారకుడిపైకి పంపనుంది. దీనికి ‘సెండ్‌ యువర్‌ నేమ్‌ టు మార్స్‌’ పేరిట సెప్టెంబరు 30 వరకు నాసా పేర్లను ఆహ్వానించగా కోటి మందికి పైగా ప్రజలు పేర్లను పంపారు. వీటిలో తిరుమల శ్రీవేంకటేశ్వరుని పేరు ఉండడం విశేషం. నేషనల్‌ మిషన్‌ ఆఫ్‌ మాన్యుస్క్రిప్ట్‌ మాజీ డైరెక్టర్‌ వి.వెంకటరమణారెడ్డి నాసా వెబ్‌సైట్‌లో శ్రీవారి పేరును ప్రతిపాదించారు. నాసా మార్స్‌ మిషన్‌ ప్రయోగం 2020 జూలైలో జరగనుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *