తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల రెండో రోజు ఉదయం ఆ దేవదేవుడు చిన్నశేష వాహనంపై విహరిస్తూ గోవుల కాపరి వేణుమాధవుడిగా దర్శనమిచ్చారు. తిరు మాడ వీధుల్లో ఐదు తలల శేష వాహనంపై మలయప్పస్వామి వైభవాన్ని వీక్షించి భక్తులు పులకించిపోయారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రాత్రి స్వామివారు హంసవాహనంపై విహరించనున్నారు.
