Breaking News
Home / Entertainment / స్టార్ హీరో సూర్యకు గాయాలు..

స్టార్ హీరో సూర్యకు గాయాలు..

తమిళ స్టార్ హీరో సూర్య వర్కవుట్స్ చేస్తుండగా, ప్రమాదం జరిగి ఆయన ఎడమ చేతికి గాయమైంది. ఈ విషయాన్ని నిర్థారించిన సూర్య బంధు వర్గాలు, వెంటనే ఆసుపత్రికి వెళ్లిన ఆయన చికిత్స చేయించుకున్నారని, గాయం 90 శాతం నయం అయిందని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్టుగా అదేమీ పెద్ద గాయం కాదని, అభిమానులు ఆందోళన చెందవద్దని సూచించారు. కాగా, సూర్యకు గాయాలైనట్టు వార్త బయటకు రాగానే, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆయన త్వరగా కోలుకోవాలని పలు ప్రాంతాల్లో ఫ్యాన్స్ పూజలు చేశారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *