Breaking News
Home / Film News / ఆసుపత్రిలో చేరనున్న స్టార్ హీరో…

ఆసుపత్రిలో చేరనున్న స్టార్ హీరో…

చెన్నై: నటుడు కమల్ హాసన్ ఆసుపత్రిలో చేరనున్నారు. ఆయన కాలులో వున్న ఇంప్లాంట్‌ను తొలగించేందుకు వైద్యులు శుక్రవారం ఆయనకు శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ మేరకు ఎంఎన్ఎం పార్టీ ఒక​ ప్రకటన విడుదల చేసింది. 2016 లో జరిగిన ప్రమాదంలో కాలు విరిగినపుడు వైద్యులు ఇంప్లాంట్‌ను అమర్చారని, దీన్ని తొలగించాల్సి అవసరం ఉందని, అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా ఈ ఆపరేషన్‌ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారని ఎంఎన్‌ఎం ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆర్ మహేంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యుల సలహా మేరకు రేపు  కమల్ హాసన్ ఇందుకోసం ఆసుపత్రిలో చేరనున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన కోలుకునేందుకు కొన్ని వారాలు పాటు విరామం తీసుకోవాల్సి వుంటుందని మహేంద్రన్‌ వెల్లడించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *