Breaking News
Home / Film News / స్టార్ హీరోయిన్‌ తీసుకున్న కీలక నిర్ణయం…

స్టార్ హీరోయిన్‌ తీసుకున్న కీలక నిర్ణయం…

ఫిల్మ్ న్యూస్: తెలుగుతోపాటు తమిళంలోనూ పలువురు అగ్రహీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా వెలిగింది ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్. అయితే కొంతకాలంగా ఆమెకు విజయాలు లభించడం లేదు. తెలుగుతోపాటు తమిళంలోనూ ఆమెకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రకుల్ ఓ కీలక నిర్ణయం తీసుకుందట.

సినిమాలకు కొంతకాలం దూరం కావాలని నిర్ణయించుకుందట. తాజాగా చెన్నైలో జరిగిన ఓ సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు రకుల్ స్పందిస్తూ.. ‘తమిళంలోనే కాదు అన్ని భాషల్లోనూ సినిమాలు తగ్గించా. కావాలని కొన్ని అవకాశాలను వదులుకున్నా. ఎంతగా కష్టపడుతున్నా ఇటీవల సరైన ఫలితాలు రావడం లేదు. వరుసగా పరాజయాలే ఎదురవుతున్నాయి. అందుకే కొంతకాలం సినీ రంగానికి దూరమవ్వాలని నిర్ణయించుకున్నా. ఇకపై, మంచి కథ, నచ్చిన పాత్ర అయితేనే సినిమాలు అంగీకరిస్తాన’ని చెప్పింది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *