Breaking News
Home / Film News / సారీ చెబుతున్నా స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌

సారీ చెబుతున్నా స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు భారత్‌లోనే కాదు విదేశాల్లో సైతం భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ఆమిర్ నటనను, వైవిధ్యభరితమైన ఆయన సినిమాలను ఎంతగానో ఇష్టపడుతుంటారు. అయితే గతేడాది తన అభిమానులను `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` సినిమాతో ఆమిర్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌కు ఎదురైన భారీ డిజాస్టర్‌గా `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` నిలిచింది.

ఈ సినిమా ఘోర పరాజయం గురించి ఆమిర్ తాజాగా స్పందించాడు. “థగ్స్ ఆఫ్ హిందూస్తాన్`తో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాం. అందుకు సారీ చెబుతున్నా. ఆ సినిమా డిజాస్టర్ బాధ్యత నాదేన`ని చెప్పాడు. ఆమిర్ ప్రస్తుతం `లాల్ సింగ్ చద్దా` సినిమాలో నటిస్తున్నాడు. హాలీవుడ్ సినిమా `ఫారెస్ట్ గంప్`కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదలైంది.

Check Also

స్టార్ హీరో సూర్యకు గాయాలు..

Share this on WhatsAppతమిళ స్టార్ హీరో సూర్య వర్కవుట్స్ చేస్తుండగా, ప్రమాదం జరిగి ఆయన ఎడమ చేతికి గాయమైంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *