Breaking News
Home / States / Andhra Pradesh / నవంబరు 1న రాష్ట్ర అవతరణ వేడుకలు…..

నవంబరు 1న రాష్ట్ర అవతరణ వేడుకలు…..

విజయవాడ: నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు అధికారికంగా జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకు అధికారికంగా నవంబరు 1న అవతరణ వేడుకలు నిర్వహించలేదు. ఇన్నేళ్ల తర్వాత తొలిసారి ఈ వేడుకలను నిర్వహిస్తుండడంతో జగన్ ప్రభుత్వం వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తారు. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో మొదటి రోజు హస్త, చేనేత కళల ప్రదర్శనలు, రెండవ రోజు కూచిపూడి, లలిత, జానపద కళల ప్రదర్శనలు, మూడవ రోజు తెలుగు సంప్రదాయ ఆహార ఉత్పత్తుల ప్రదర్శనలు ఉంటాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *