Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / రాష్ట్ర ఆదాయం 8 శాతం మాత్రమే తగ్గింది…

రాష్ట్ర ఆదాయం 8 శాతం మాత్రమే తగ్గింది…

అమరావతి: టీడీపీ చెప్పినట్లు ఏపీ రాష్ట్ర ఆదాయం 40 శాతం తగ్గలేదని, 8 శాతం మాత్రమే తగ్గిందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గుదలపై మంగళవారం శాసనమండలిలో మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర ఆదాయమే కాదు.. దేశ ఆదాయం కూడా తగ్గుతుందన్నారు. రాష్ట్రంలో ఆదాయం తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయని అన్నారు. ఈ ఆరు నెలల కాలంలో గత ప్రభుత్వానికి చెందిన రూ. 20 వేల కోట్ల అప్పులు చెల్లించామన్నారు.

15వ ఆర్ధిక సంఘం కింద నిధులను పెంచి ఇవ్వమని కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నామని మంత్రి బుగ్గన తెలిపారు. గత ఏడాది జూలై, నుంచి డిసెంబర్ మధ్యలో అప్పటి టీడీపీ ప్రభుత్వం 24 రోజులు ఓడీలో ఉందన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం జూలై నుంచి డిసెంబర్ మధ్యలో రెండు రోజులు మాత్రమే ఓడీలో ఉందన్నారు. గత ప్రభుత్వం పవర్ బకాయిలైన రూ. 4,900 కోట్లను తమ ప్రభుత్వం ఒక్కరోజులోనే చెల్లించిందని మంత్రి బుగ్గన చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *