Breaking News
Home / States / Andhra Pradesh / ఇసుక కొరతపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన….

ఇసుక కొరతపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన….

గుంటూరు: ఇసుక కొరతపై ఈనెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మాజీ మంత్రి, టీడీపీ నేత ఆలపాటి రాజా చెప్పారు. అన్ని రెవెన్యూ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇసుక కొరతతో ఇబ్బంది పడుతున్న వర్గాలు ఈ ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇసుక కొరత కారణంగా రాష్ట్రంలో 30 లక్షల మందికిపైగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొత్త ఇసుక విధానం ద్వారా  వైసీపీ నేతలే లబ్ధి పొందారని రాజా ఆరోపించారు. అవినీతి రహిత పాలన అందిస్తామని సీఎం జగన్ చెప్పిన మాటలకు.. ఇప్పుడు జరుగుతున్న దానికి పొంతనే లేదని విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *