Breaking News
Home / Lifestyle / Business / ఉవ్వెత్తున ఎగిసి ‘పడిన’ మార్కెట్‌

ఉవ్వెత్తున ఎగిసి ‘పడిన’ మార్కెట్‌

118 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌
ముంబై: స్టాక్‌ మార్కెట్‌ రిలీఫ్‌ ర్యాలీకి మళ్లీ బ్రేక్‌ పడింది. ఇంట్రాడేలో మరో రికార్డు స్థాయిని తాకిన సూచీలు, తీవ్ర ఆటుపోట్లతో అంతేవేగంగా వెనక్కి తిరిగి నష్టాలతో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్‌ 117.77 పాయింట్ల నష్టం తో 39,714.20 వద్ద, నిఫ్టీ 23.10 పాయింట్ల నష్టంతో 11,922.80 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 19 కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. ఈ వారం లో మొత్తంగా సెన్సెక్స్‌ 279.4 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 78.70 పాయింట్ల లాభంతో ముగిశాయి.

మోదీ మంత్రివర్గ కూర్పుతో శుక్రవారం ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,122.34 పాయింట్లు, నిఫ్టీ 12,039.25 పాయింట్లను తాకి జీవిత కాల గరిష్ఠ స్థాయిలకు చేరువలోకి వెళ్లాయి. అయితే అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలతో వెంటనే వెనక్కి తిరిగాయి. మొత్తం మీద శుక్రవారం ఒక్క రోజే సెన్సెక్స్‌ 750 పాయింట్లు అటుఇటుగా కదలాడింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఎలా ఉంటాయోనన్న భయాలూమార్కెట్‌ను వెంటాడాయి.

పవర్‌, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, యుటిలిటీస్‌, బేసిక్‌ మెటీరియల్స్‌, బ్యాంకింగ్‌ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి, సూచీల్ని బాగా దెబ్బతీశాయి. టెక్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, టెలికాం, ఎనర్జీ కంపెనీల షేర్లు మాత్రమే కొద్దిపాటి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ షేర్లలో యెస్‌ బ్యాంక్‌ షేరు అత్యధికంగా 4.27 శాతం నష్టపోయింది. ఐటీసీ, వేదాంత, ఎం అండ్‌ ఎం, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌ కంపెనీల షేర్లూ 3.61 శాతం వరకు నష్టపోయాయి. ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఓఎన్‌జీజీ, ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ షేర్లు మాత్రం కొద్దిపాటి లాభాలతో ముగిశాయి.

‘శనివారం వెలువడే మే నెల ఆటో కంపెనీల అమ్మకాల వివరాలు, జూన్‌ 6న కీలక వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం తీరుతెన్నులు, ముడి చమురు ధర వచ్చే వారం మార్కెట్‌ గమనాన్ని నిర్ణయిస్తాయి. మేమైతే ఈక్విటీ మార్కెట్‌పై ఆశాభావంతోనే ఉన్నాం. ప్రైవేట్‌ బ్యాంకుల షేర్లకే మా ప్రాధాన్యత’ అని బీఎన్‌పీ పరిబాస్‌ నిర్వహణలోని షేర్‌ఖాన్‌ అడ్వైజరీ హెడ్‌ హెమాంగ్‌ జానీ చెప్పారు.

Check Also

నేడు న్యూఢిల్లీలో లోక్ సభ నూతన సభాపతి నియామకం

Share this on WhatsAppన్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్న నేపథ్యంలో బీజేపీ ఇవాళ నూతన సభాపతి నియామకం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *