Breaking News
Home / Lifestyle / Business / మళ్లీ 35000 స్థాయికి..

మళ్లీ 35000 స్థాయికి..

గ్లోబల్‌ మార్కెట్లు, రూపాయి దన్ను.. 580 పాయింట్ల లాభం
నెల రోజుల గరిష్ఠ స్థాయిలో సెన్సెక్స్‌.. 10550 స్థాయిలో నిఫ్టీ.. రెండు వారాల నష్టాలకు బ్రేక్‌
స్టాక్‌ మార్కెట్లు మళ్లీ బుల్‌ బాట పట్టాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో చర్చలకు సానుకూలంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించటంతో ఆసియా మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లన్నీ దూకుడును ప్రదర్శించాయి. గ్లోబల్‌ మార్కెట్ల మద్దతు, రూపాయి బలపడటం వంటి అంశాలతో భారత స్టాక్‌ మార్కెట్లు కూడా నెల రోజుల గరిష్ఠ స్థాయిల్లో క్లోజయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మరోసారి 35 వేల మార్కును అధిగమించింది.

ముంబై : అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ, రూపాయి బలపడటంతో శుక్రవారం నాడు దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి ఇరు దేశాధినేతలు చర్చలు జరపనున్నట్లు వార్తలు వెలువడటంతో ఆసియా, యూరోపియన్‌ మార్కెట్లో సెంటిమెంట్‌ బలపడింది. మరోవైపు క్రూడాయిల్‌ ధరలు మరింత తగ్గటం కూడా కలిసి వచ్చింది. ఇదే సమయంలో రూపాయి ఇంట్రాడేలో ఏకంగా 95 పైసలు లాభపడటంతో బీఎ్‌సఇ సెన్సెక్స్‌ నిఫ్టీ ఆద్యంతం జోరును ప్రదర్శించాయని బ్రోకర్లు వెల్లడించారు.

30 షేర్ల ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ప్రారంభంలోనే పటిష్ఠంగా 34793.95 పాయింట్ల లాభంతో మొదలై 35 వేల స్థాయిని తాకి ఒక దశలో 35190.20 పాయింట్లను తాకింది. అనంతరం లాభాల స్వీకరణకు దిగటంతో ఆరంభ లాభాలు కొద్దిగా కోల్పోయి చివరకు 579.80 పాయింట్ల (1.68 శాతం) లాభంతో 35011.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. అక్టోబరు 4 వ తేదీ తర్వాత సెన్సెక్స్‌ మళ్లీ స్థాయిలో క్లోజవటం ఇదే తొలిసారి. మరోవైపు ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 10606.95 పాయింట్లతో గరిష్ఠ స్థాయిని తాకి చివరకు 172.55 పాయింట్ల (1.66 శాతం) లాభంతో 10553 పాయింట్ల వద్ద ముగిసింది. వీక్లీ ప్రాతిపదికన సెన్సెక్స్‌, నిఫ్టీ.. రెండు వారాల నష్టాలకు బ్రేక్‌ వేశాయి. సెన్సెక్స్‌ ఏకంగా 1662.34 పాయింట్లు (5 శాతం), నిఫ్టీ 523 పాయింట్లు (5 శాతం) లాభపడ్డాయి.

క్రూడాయిల్‌, జీఎస్టీ జోష్‌..
క్రూడాయిల్‌ ధరలు ఏడు నెలల కనిష్ఠ స్థాయి 73 డాలర్లకు పడిపోవటంతో భారత్‌ సహా అంతర్జాతీయ మార్కెట్లలో జోష్‌ నింపింది. ఇంధన ఉత్పత్తిదారులు ముడి చమురు ఉత్పత్తిని పెంచుతున్నట్లు ప్రకటించటంతో ఒక దశలో బ్యార ల్‌ ముడి చమురు ధర 72.65 స్థాయిలకు చేరింది. మరోవైపు ఐదు నెలల అనంతరం అక్టోబరు నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మార్కును అధిగమించటం కూడా కలిసివచ్చింది. ఎఫ్‌ఐఐలు అమ్మకాల బాటను వదిలి రూ.348.75 కోట్ల విలువైన కొనుగోళ్లను చేపట్టగా దేశీయ సంస్థాగత కొనుగోలుదారులు రూ.509.17 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

రూ.1.72 లక్షల కోట్లు పెరిగిన సంపద
స్టాక్‌ మార్కెట్లు దూసుకుపోవటంతో శుక్రవారం ఇన్వెస్టర్ల సంపద రూ.1.72 లక్షల కోట్లు పెరిగింది. బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,40,78,702.09 కోట్ల నుంచి రూ. 1.72,870.06 కోట్లకు దూసుకుపోయింది. నవం బరు నెల ఆరంభంలో ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు రెండో రోజునే దూకుడును ప్రదర్శించటం విశేషం.

వెలుగులు విరజిమ్మిన ఆటో, ఫైనాన్షియల్‌ షేర్లు..
శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఆటోమొబైల్‌, ఫైనాన్షియల్‌ కంపెనీల షేర్లలో ముందుగానే దీపావళి వెలుగులు కనిపించాయి. శుక్రవారం నాడు మారుతి సుజుకీ షేరు 6.37 శాతం లాభంతో టాప్‌ పెర్‌ఫార్మర్‌గా నిలవగా టాటా మోటార్స్‌ 6.29 శాతం, బజాజ్‌ ఆటో 2.31 శాతం లాభపడ్డాయి. వేదాంత లిమిటెడ్‌ 6.04 శాతం, ఇండస్‌ ఇండ్‌ 5.29 శాతం, అదానీ పోర్ట్స్‌ 4.46 శాతం, ఎం అండ్‌ ఎం 3.87 శాతం, టాటా స్టీల్‌ 3.07 శాతం, యస్‌ బ్యాంక్‌ 2.77 శాతం మేర లాభపడిన వాటిల్లో ఉన్నాయి. క్రూడాయిల్‌ ధరలు పడిపోవటంతో చమురు మార్కెటింగ్‌ సంస్థలైన హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐవోసీ 6.69 శాతం వరకు లాభపడ్డాయి. కాగా టీసీఎస్‌, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా షేర్లు 3.29 శాతం వరకు నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే బీఎ్‌సఈ ఆటో ఇండెక్స్‌ 4.05 శాతం, మెటల్‌ 3.04 శాతం మేర లాభపడ్డాయి.

Check Also

జైలు గోడలెక్కి కిందికి దూకుతామంటూ ఖైదీల హల్‌చల్

Share this on WhatsAppతమిళనాడు: మదురై సెంట్రల్ జైలు ఖైదీలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *