Breaking News
Home / National / భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు….

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు….

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. హెవీవెయిట్ కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్ టెల్ వంటి కంపెనీల షేర్లు ఒత్తిడికి గురి కావడంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. మధ్యాహ్నం తర్వాత బ్యాంకింగ్ షేర్లు కూడా కుదేలు కావడంతో నష్టాలు మరింత పెరిగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 297 పాయింట్లు పతనమై 41,163కి పడిపోయింది. నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి 12,126కి దిగజారింది. ఓఎన్జీసీ (1.63%), ఎన్టీపీసీ (1.09%), టాటా స్టీల్ (1.06%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.40%), ఏసియన్ పెయింట్స్ (0.29%) లాభపడగా, భారతి ఎయిర్ టెల్ (-2.23%), ఎల్ అండ్ టీ (-1.72%), సన్ ఫార్మా (-1.72%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.38%), మారుతి సుజుకి (-1.18%) నష్టపోయాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *