Breaking News
Home / Lifestyle / Business / భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

ముంబై: దేశీయ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. గత ఆరు సెషన్లలో నష్టాలను చవి చూసిన సూచీలు లాభాల బాటపట్టాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 645 పాయింట్లు లాభపడి, 38,177వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ నిఫ్టీ 186 పాయింట్ల లాభంతో 11,300 మైలు రాయిని దాటింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.96గా ఉంది.అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 36 పాయింట్లు లాభపడి 37,568 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను కొనసాగించింది. అయితే, ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకున్న సూచీలు చివరకు భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని 5శాతం పెంచుతున్నట్లు కేంద్రం తీపి కబురు చెప్పడం, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్లు లాభాల్లో కొనసాగడం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు షేర్లు 6శాతం వృద్ధిని నమోదు చేయడం, ముడి చమురు ధరలు బ్యారెల్‌ 60 డాలర్లకన్నా తక్కువగా ఉండటం సహా పలు కారణాలు మార్కెట్‌ లాభాలకు కారణమైందని విశ్లేషకులు తెలిపారు. బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ తదితర షేర్లు లాభపడగా, యస్‌ బ్యాంకు, హీరో మోటోకార్ప్‌, టైటాన్‌ కంపెనీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *