Breaking News
Home / Lifestyle / Business / నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు….

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు….

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 198 పాయింట్లు నష్టపోగా, 38,106 వద్ద ముగిసింది. ఇక నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్ నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 11,313 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.89గా ఉంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 151 పాయింట్లు పోగా, నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయింది. మరోసారి వాణిజ్య యుద్ధానికి పరిస్థితులు దారి తీయొచ్చన్న వార్తలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో యస్‌ బ్యాంకు షేరు దూసుకెళ్లింది. దీంతో పాటు బీపీసీఎల్‌, టాటామోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు లాభపడగా, వేదాంత, కోల్‌ ఇండియా, హిందాల్కో, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు తదితర షేర్లు నష్టాలను మూట గట్టుకున్నాయి.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *