Breaking News
Home / Lifestyle / Business / నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

ముంబై: దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఆర్‌బీఐ ప్రకటించిన కీలక వడ్డీరేట్లు తగ్గింపు ప్రకటన నేపథ్యంలో బ్యాంకింగ్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. దీంతో సెన్సెక్స్‌ 433.56 పాయింట్లు నష్టపోయి 37,673.31 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 139.25 పాయింట్లు కోల్పోయి 11,174 పాయింట్ల వద్ద ముగిసింది.

ఉదయం దాదాపు 300 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఆర్‌బీఐ ప్రకటన తర్వాత నష్టాల బాట పట్టింది. ఇంట్రాడేలో 37,633 కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌ స్వల్పంగా కోలుకుంది. బీఎస్‌ఈలో కొటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌‌టీ, టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, ఓఎన్‌జీసీ, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ షేర్లు లాభాల బాట పట్టాయి. ఆర్‌బీఐ విధాన పరపతి సమీక్ష నిర్ణయం బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఆటో, రియల్టీ షేర్లపై పైడింది. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.97గా ఉంది.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *